కరోనా దెబ్బకు మహేష్ కూడా..!

Published on Aug 7, 2020 10:25 am IST

మహేష్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సిద్ధం అవుతున్నారు. మరో రెండు రోజులలో మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఎప్పటిలాగే మహేష్ బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ఆలోచనతో ఉన్నారు. ఐతే మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఏళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలిపిన మహేష్, ప్రపంచం కరోనా వ్యాప్తితో అల్లాడుతున్న తరుణంలో భద్రత అనేది ముఖ్యం. కాబట్టి గుంపులుగా చేరకండి అన్నారు. అలాగే భద్రంగా ఉండండి అని చెప్పడం జరిగింది. పరోక్షంగా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించకండి అని మహేష్ చెప్పారు.

ఇక భౌతిక వేడుకలకు ఫ్యాన్స్ దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ చేసి రికార్డులు నెలకొల్పడానికి రెడీ అవుతున్నారు. కాగా మహేష్ బర్త్ డే రోజు ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నుండి సర్ప్రైజ్ రానుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :