సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కూలీ”. పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో చేసిన ఈ సినిమా థియేటర్స్ లో ఇంకొక రోజులో పడనుంది. మరి ఈ భారీ సినిమా ఎక్కడెక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే తెలుగు స్టేట్స్, తమిళనాడు అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో మినిమమ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ.
కానీ నార్త్ మార్కెట్ లో మాత్రం పూర్తిగా సినిమా టాక్ మీదే ఆధారపడి ఉందని చెప్పాలి. అమీర్ ఖాన్ లాంటి స్టార్ ఉన్నా కూడా ముంబై లాంటి చోట్ల బుకింగ్స్ లో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. సో నార్త్ లో రాణించాలంటే స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిందే అని చెప్పాలి. మరి వేచి చూడాలి హిందీలో ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది.


