“ఆచార్య” అద్దిరే అప్డేట్ వస్తుంది గెట్ రెడీ.!

Published on Nov 23, 2021 7:00 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మరి ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలోనటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ఫస్ట్ లిరికల్ సాంగ్ 100 మిలియన్ మార్క్ ని నిన్ననే క్రాస్ చెయ్యగా మేకర్స్ ఈ హ్యాపీ మూమెంట్ లో ఓ ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని కూడా అందించారు.

ఈసారి ఓ అదిరే అప్డేట్ ని ఇవ్వబోతున్నారట. అలాగే ఈ అప్డేట్ రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రకి సంబంధించి ఉండబోతున్నట్టు కూడా హింట్ ఇచ్చారు. మరి ఇది ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లు గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :

More