“కేజీయఫ్ 2″లో కూడా అదిరే ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారా.?

Published on May 1, 2021 8:00 am IST

ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పుకున్నా పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా అని అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటూనే మొదటి చాప్టర్ లో యాక్షన్ సాంగ్స్ డిజైన్ చేసారు.

మరి అదే విధంగా మన సౌత్ వెర్షన్ కి ఒక ఐటెం సాంగ్ అలాగే బాలీవుడ్ వెర్షన్ కి ఒక ఐటెం సాంగ్ ని కూడా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి చాప్టర్ లో కూడా ఓ ఆడితే ఐటెం సాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ రెండు వెర్షన్స్ లో ఉంటుందో లేదో కానీ బాలీవుడ్ హాట్ ఐటెం భామలు జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరియు నోరా ఫతేహి పేర్లు ఇప్పుడు ఆ సాంగ్ కు వినపడుతున్నాయి. మరి ఎవరితో ఈ సారి ప్లాన్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం :