సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో రాబోతున్నాడు. కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్ వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ వార్తకు మరింత బలం చేకూరిస్తూ అనేక రూమర్స్ వింపించాయి. చివరకు ఈ వార్తలను నిజం చేస్తూ ఈ రోజు జయకృష్ణ మొదటి సినిమా గురించి క్లారిటీ వచ్చింది.
పైగా ఆర్ఎక్స్ 100, ‘మంగళవారం’ లాంటి సినిమాలతో బోల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, జయకృష్ణ ఎంట్రీ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించనున్నాయి. అంటే ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అన్నట్టు అజయ్ భూపతి మాత్రం ప్రస్తుతం ‘మంగళవారం 2’తో బిజీగా ఉన్నాడు.