అవైటెడ్ “RRR” ఆడియోపై సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Jul 4, 2021 9:43 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు తుది దశ షూటింగ్ లో ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి కూడా రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణినే సంగీతం అందిస్తుండగా ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తమ చిత్ర యూనిట్ వారికి జన్మదినస శుభాకాంక్షలు తెలియజేసారు.

మరి అలా తెలియజేస్తూ అవైటెడ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అయినటువంటి “RRR” పాటలను అతి త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక ఈ పోస్టర్ లోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ “అక్టోబర్ 13” నే అని మళ్ళీ పొందుపరిచారు. దీనితో రాజమౌళి కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి అప్పుడు పరిస్థితులు బాగుండాలని ఈ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఎంజాయ్ చెయ్యాలని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం :