ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ చిత్రాల మోస్ట్ అవైటెడ్ టీజర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రాధేశ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం నుంచి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మేకర్స్ టీజర్ అయితే తొందరలోనే వస్తుంది అని అంటున్నారు..
కానీ ఇంకా సరైన కన్ఫర్మేషన్ రాలేదు. కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి కానుకగానే ఈ చిత్రం టీజర్ వస్తుంది అని అంటున్నారు. మరి ఇది ఎప్పుడు వస్తుందా అన్న అప్డేట్ ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందివ్వగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.


