పవన్ ఒక నిప్పుకణం..అన్నయ్య చిరు వెరీ స్పెషల్ విషెష్!

Published on Sep 2, 2021 10:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ మీడియాలో మరియు ఆఫ్ లైన్ లో సంబరాలు హోరెత్తుతున్నాయి. మరి సోషల్ మీడియాలో అయితే పవన్ అభిమానులతో పాటుగా అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు తమ శుభాభినందనలు అందిస్తున్నారు. అయితే ఈ అన్ని స్పెషల్ విషెష్ లో మాత్రం పవన్ సోదరుడు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషెష్ మరింత ప్రత్యేకం అని చెప్పాలి.

“చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు”. అని పవన్ పై తన ప్రేమను వ్యక్తం చేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో ఈ విషెష్ మరింత ఉత్సహాన్ని తీసుకొచ్చాయి..

సంబంధిత సమాచారం :