ఆ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు !

ఆ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు !

Published on Jun 4, 2019 11:33 AM IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రను కంగనా రనౌత్ ఎలా మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు