అఖిల్ ఇంట్రడక్షన్ కి కోటి రూపాయలా.!

అఖిల్ ఇంట్రడక్షన్ కి కోటి రూపాయలా.!

Published on Mar 12, 2015 1:06 PM IST

akhil
అక్కినేని ఫ్యామిలీ నవతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో అఖిల్ – హీరోయిన్ సయేశా సైగల్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా సినిమాలో అఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ ని భారీ ఎత్తున షూట్ చేసారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని స్టంట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసాడు.

ఇప్పుడు ఆ ఇంట్రడక్షన్ ఫైట్ గురించి మీకో ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తున్నాం.. ఈ చిత్ర వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ కోసం సుమారు కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టారట. నాగార్జున అఖిల్ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని చెప్పడంతో ఈ చిత్ర నిర్మాత నితిన్ ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా చాలా రిచ్ గా ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ఈ మూవీ టీం సన్నిహితులు చెబుతున్నారు. దీని ప్రకారం వినాయక్ ఈ ఇంట్రడక్షన్ ఫైట్ ని ఆడియన్స్ మతిపోయేలా తీసి ఉంటాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఈ మూవీలో అఖిల్ కి పోటీ ఇచ్చే విలన్ గా మహేష్ మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి సంగీతం అందిస్తున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు