వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “A1 ఎక్స్ ప్రెస్”

Published on Aug 29, 2021 6:43 pm IST

హాకీ ఆట నేపథ్యం లో డెనిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం A1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రం విడుదల అయి తెలుగు నాట సూపర్ హిట్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విడుదల కానుంది. జెమిని టీవీ లో వచ్చే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది.

నేషనల్ గేమ్ అయిన హాకీ పై తెలుగు లో తొలి చిత్రం ఇదే అని చెప్పాలి. ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది. ఈ చిత్రం లో రావు రమేష్, మురళి శర్మ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :