బన్నీ – త్రివిక్రమ్ రేపటి నుండే.. !

Published on Apr 23, 2019 7:43 pm IST

త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా రేపటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపింది. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. మరో కీలక పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నాడు.

కాగా ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ – త్రివిక్రమ్ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :