అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ అప్డేట్ !

Published on Apr 24, 2019 10:08 am IST

ఏడాది తరువాత సెట్ లోకి అడుగుపెడుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న 19వ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో ప్రారంభం కానుంది.

ఇక ఈ చిత్రంలో బోమన్ ఇరానీ , జయరాం ,టబు , సుశాంత్ , నవదీప్ వంటి స్టార్ క్యాస్ట్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా డీజే తరువాత పూజా హెగ్డే మరోసారి బన్నీ కి జోడిగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి మంచి విజయాలను సాధించాయి. మరి ఈ చిత్రం తో హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :