సుకుమార్ – బన్నీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?

సుకుమార్ – బన్నీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Apr 5, 2020 11:32 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – స్టార్ హీరో అల్లు అర్జున్ కలయికలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. బాహుబలి 2 కూడా 2017లో ఇదే తేదీన విడుదలై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ సినిమాలను కూడా సుకుమార్ రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. అలాగే ఈ సినిమాని కూడా అలాంటి జోనర్ లోనే తీస్తున్నాడని ఆ వార్తల సారాంశం.

కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ క్యారెక్టర్ లోనే తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ చిత్రంతో కూడా మరో సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు