మోదీ పోస్ట్‌కు AA23 థీమ్.. గ్లోబల్ లెవెల్‌లో బన్నీ క్రేజ్ వైరల్..!

మోదీ పోస్ట్‌కు AA23 థీమ్.. గ్లోబల్ లెవెల్‌లో బన్నీ క్రేజ్ వైరల్..!

Published on Jun 16, 2026 4:01 PM IST

AA23-Modi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘AA23’. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే దీని థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్ విడుదలైన వెంటనే ఇన్‌స్టంట్ సెన్సేషన్‌గా మారింది. ఇప్పటికే వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 1.2 మిలియన్లకు పైగా రీల్స్‌లో ఈ ట్యూన్ మార్మోగిపోతోంది.

అయితే, తాజాగా ఈ థీమ్ సాంగ్‌కు ఎవరూ ఊహించని విధంగా గ్లోబల్ లెవెల్ బూస్ట్ లభించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రత్యేక వీడియోకు ఈ ‘AA23’ థీమ్ మ్యూజిక్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఉపయోగించారు. స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినిని కలిసిన విజువల్స్‌తో కూడిన రీల్‌కు ఈ సాంగ్‌ను జోడించారు. ప్రధాని మోదీ పోస్ట్‌లో ఈ ట్యూన్ వినిపించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ హై-ప్రొఫైల్ ప్రమోషన్‌తో ఈ సినిమా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది.

మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కావడానికి ప్రేక్షకులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాకా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘రాకా’ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే ‘AA23’ పట్టాలెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు