అమర్ అక్బర్ ఆంటొని టీజర్ టాక్ – ఆసక్తికరంగా వుంది !

అమర్ అక్బర్ ఆంటొని టీజర్ టాక్ – ఆసక్తికరంగా వుంది !

Published on Oct 29, 2018 7:50 PM IST

aaa1

వరుస పరాజయాల తరువాత శ్రీను వైట్ల – రవితేజ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ అంటోని’. ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయ్యింది. ఇక టీజర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఇంట్రస్టింగ్ గా వుంది. ఈచిత్రంలో అమర్ , అక్బర్ ,ఆంటొని గా మూడు డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు రవితేజ.

ఇక హై క్వాలిటీ విజువల్స్ ఈ టీజర్ కు ప్రధాన ఆకర్షణ కాగా శ్రీను వైట్ల చెప్పినట్లు ఈ టీజర్ చూస్తుంటే ఈచిత్రాన్ని తన శైలికి భిన్నంగా తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. ఇలియానా కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు