స్పోర్ట్స్ డ్రామా చాల బాగా వస్తోందట !

Published on Aug 18, 2019 11:10 pm IST

మొదటినుంచీ కొత్త కథలతో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ తెలుగు – తమిళ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. కాగా ఆది ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది. ఓ యువ‌కుడు అథ్లెట్‌ గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. స్పోర్ట్స్ డ్రామాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటివరకూ షూట్ చేసిన పార్ట్ చాల బాగా వచ్చిందట.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఐఐటీ ఈ షూట్ కోసం ఆది ఫుల్ గా కఠినమైన కసరత్తులు కూడా చేస్తోన్నాడట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ చిత్రాన్ని బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :