ఆది సినిమాకు డిఫరెంట్ టైటిల్

Published on Jun 12, 2019 7:28 pm IST

భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఇష్టపడే నటుడు ఆది పినిశెట్టి. పాత్ర బాగుంటే సపోర్ట్ రోల్ చేయడానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం ఈయన ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఇళయరాజా, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, నాని వంటి ప్రముఖులు సమక్షంలో చిత్రం ఈరోజే అధికారికంగా లాంచ్ అయింది. ఇందులో ఆది ఒక అథ్లెట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘క్లాప్’ అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు.

ఇందులో ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్, పిఎంఎం ఫిలిమ్స్, కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కోసం ఆది ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. టైటిల్ చూస్తే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ దండిగా ఉంటుందని అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More