పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘గరం’

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆది ‘గరం’

Published on Nov 15, 2015 1:37 AM IST

Garam
డైలాగ్ కింగ్ సాయి కుమార్ నట వారసుడిగా ‘ప్రేమకావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో ఆది ఆ తర్వాత ‘లవ్లీ’, ‘గాలిపటం’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆది చేస్తున్న ఏడవ సినిమా ‘గరం’. గతంలో ‘పెళ్ళైన కొత్తలో’, ‘గుండె ఝల్లుమంది’. ‘ప్రవరాఖ్యుడు’ సినిమాలను అందించిన డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దాంతో ఈ చిత్ర టీం ఈ రోజు హైదరాబాద్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఈ సినిమా కథ నచ్చి సాయి కుమార్ నిర్మాతగా మారి చేస్తున్న సినిమా ఇది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి శ్రీనివాస్ కథని అందించాడు. ఈ సినిమా స్టేటస్ గురించి చెబుతూ ‘షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియో మరియు సినిమా రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తామని’ తెలిపారు. ఆది సరసన ‘హార్ట్ ఎటాక్’ ఫేం ఆద శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా ఆది వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా చివరి దశకు చేరుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు