‘పక్కింటి అబ్బాయి’ గా మారనున్న ‘చుట్టాలబ్బాయి’

aadi
ఇన్నాళ్లు మాస్ ఎంటర్టైనర్లని నమ్ముకుని పరాజయాలను చవి చూసిన హీరో ఆది తాజాగా ‘చుట్టాలబ్బాయి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని ఎంచుకుని ఎట్టకేలకు హిట్ కొట్టాడు. తొలుత ఈ చిత్రానికి మిశ్రమ ఫలితాలే వచ్చినప్పటికీ టీమ్ సినిమాని వివిధ రకాల ప్రమోషన్ల ద్వారా జనానికి దగ్గర చేసి హిట్ టాక్ దక్కేలా చేసింది.

నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఆది తండ్రి, సీనియర్ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ త్వరలో ఆది కొత్త చిత్రం ‘పక్కింటి అబ్బాయి’ ని మొదలుపెడతామని తెలిపారు. గరం చిత్రం తరువాత ఈ సినిమానే చేద్దామనుకున్నామని కానీ వీరభద్రం ‘చుట్టాలబ్బాయి’ కథ చెప్పేటప్పటికి అది వెనుకబడిందని, మళ్ళీ ఇప్పుడు మొదలుపెడుతున్నామని, అలాగే ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నానని కూడా తెలిపారు. గతంలో సాయికుమార్ ఆదితో గరం చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.