తమిళ్ రీమేక్ లో నటిస్తోన్న ఆది పినిశెట్టి !

తమిళ్ రీమేక్ లో నటిస్తోన్న ఆది పినిశెట్టి !

Published on Mar 26, 2018 8:00 PM IST

కోన వెంకట్ సమర్పణలో “గీతాంజలి” చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. లవర్స్ సినిమాకు దర్శకత్వం వహించిన హరినాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిసున్నాడు. గురు సినిమా హీరోయిన్ రితిక సింగ్ నటిస్తోంది.

తాజా సమాచారం మేరకు తమిళ్ లో మంచి విజయం సాధించిన ”అదే కంగల్” సినిమాను ఆది పినిశెట్టి తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆది పినిశెట్టి చూపులేని వాడిగా నటిస్తున్నాడు. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు