పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్ దంపతులు

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్ దంపతులు

Published on Jan 2, 2026 11:01 PM IST

Aadi Sai Kumar

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ ‘శంబాల’ చిత్రంతో అందుకున్నాడు. యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు.

ఆది సాయికుమార్ భార్య అరుణ తాజాగా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సాయి కుమార్ ఫ్యామిలీలో సంతోషం రెట్టింపు అయ్యింది. ఓ వైపు ఆది సాయి కుమార్ శంబాల సక్సెస్ కావడం.. ఇప్పుడు తమ ఇంట వారసుడు రావడం.. ఇలా డబుల్ సంతోషాన్ని ఆ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఆది సాయి కుమార్-అరుణ 2014లో వివాహం చేసుకోగా వారికి ఓ పాప ఉంది. ఇప్పుడు కొడుకు రాకతో ఈ జంట సంతోషంలో మునిగిపోయారు.

తాజా వార్తలు