ఆది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ షూటింగ్ స్టార్ట్.!

ఆది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ షూటింగ్ స్టార్ట్.!

Published on Jul 16, 2021 5:23 PM IST

తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా విజయాలు కొనసాగించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్.మరి ఇప్పుడు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ షూట్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్.

దాదాపు రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా. ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది అని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎస్‌.బాల‌వీర్‌, నిర్మాత: ఎస్‌వీఆర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ : లక్ష్మణ్ స్వామి, నాగ మధు, సంగీతం: కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్ విష్ణు , లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం, పబ్లిసిటీ డిజైనర్‌: కడియం వెంకట్‌, పి.ఆర్‌.ఓ: సాయి సతీశ్‌, పర్వతనేని రాంబాబు లు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు