ఆది సాయి కుమార్ కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్ !

Published on Apr 6, 2019 1:00 am IST

ప్రేమకావాలి చిత్రం తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. ఆయనకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. అయితే ఆ తరువాత చేసిన సినిమాలు ఆది కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేకపోయాయి. ఇక ఇప్పుడూ ఈ హీరో ఎలాగైనా సాలిడ్ హిట్టు కొట్టాలని సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇటీవలే ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే చిత్రాన్ని పూర్తి చేసిన ఆది ప్రస్తుతం ‘జోడి’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదలకాగా రేపు ఉదయం 10:35 గంటలకు ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయనున్నారు. విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More