థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ‘అమరన్‌ ‘ !

Published on Apr 24, 2021 7:26 pm IST

వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్‌.వీ.ఆర్‌ ప్రొడక్షన్‌ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘అమరన్‌’ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1. అవికా గోర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా శనివారం లాంఛనంగా ప్రారంభమైంది.

ఎస్‌.బల‌వీర్‌ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీర‌భ‌ద్రం చౌద‌రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో ‘అమరన్‌ ‘ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా రూపొందుతుంది.

గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్‌ టచ్‌ కూడా ఉంటుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు నిర్మాత‌లు. అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్‌ రెండేళ్లు పాటు శ్రమించారు. ప్రేక్షకకులను ఎంగేజ్‌ చేసే కథాంశంతో థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :