ఆదిపురుష్ : తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ

Published on Jun 6, 2023 7:30 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ మైథలాజికల్ జానర్ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాఘవ గా కృతి సనన్ సీతగా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ లక్ష్మణుడిగా అలానే దేవదత్త నాగే హనుమంతునిగా నటించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీని రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
భారీ వ్యయంతో నిర్మించారు.

ఇక నేడు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరుగనుండగా మూవీని జూన్ 16న పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఆదిపురుష్ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు జీఎస్టీ తో కలిపి ఏకంగా రూ. 160 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా వీటిలో నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వారు రూ. 60 కోట్లకు దక్కించుకున్నారట. మొత్తంగా అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన ఆదిపురుష్ అటు ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అదరగొడుతోంది. మరి రిలీజ్ తరువాత ఈ మూవీ ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలని పలువురు ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :