బుర్రకథ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Apr 25, 2019 7:08 pm IST

ప్రేమకావాలి తరువాత మళ్ళీ ఇప్పటివరకు హిట్ కొట్టలేకపోయాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆది ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ , జోడి’ , బుర్రకథ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

అందులో ఇటీవల బుర్రకథ సినిమా ను పూర్తి చేశాడు ఆది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. మే 24న ఈ చిత్రం ప్రేక్షకులమందుకు రానుంది. డైలాగ్ రైటర్ కం డైరెక్టర్ డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రబోర్తి , నైరా షా కథానాయికలుగా నటిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :