దుబాయ్ లో లాభాల బాట పట్టిన ‘ఆగడు’

Published on Sep 20, 2014 2:00 pm IST

aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ అయిన ప్రతి చోటా మంచి డిమాండ్ ఉంటుంది. అలా బాగా డిమాండ్ ఉన్న ఏరియాల్లో దుబాయ్ కూడా ఒకటి. అందుకే ఈ సినిమాని దుబాయి డిస్ట్రిబ్యూటర్స్ 35 లక్షలకి కొనుక్కున్నారు. ఇక్కడ రికార్డ్ ఏమిటంటే వారు పెట్టిన మొత్తం ఒక్కరోజులోనే వచ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అసలు విషయం లోకి వెళితే మహేష్ బాబుకి ఉన్న స్టార్ స్టేటస్ వల్ల దుబాయ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం పెట్టిన మొత్తం వారికి ఒక్క రోజులోనే వచ్చేయడంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు. వారు పెట్టిన మొత్తం ఒక్కరోజులోనే వచ్చేయడంతో రెండవ రోజు నుంచి వారికి లాభాలు భారీగా రావచ్చని ఆశిస్తున్నారు. అలాగే దుబాయ్ లో మొత్తం 35 స్క్రీన్స్ లో ఆగడు షోస్ పడుతున్నాయి.

దీన్నిబట్టి మహేష్ బాబుకి ఏ రేంజ్ లో ఓవర్సీస్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ సరసన తమన్నా జోడీ కట్టిన ఈ మూవీకి శ్రీను వైట్ల డైరెక్టర్.

సంబంధిత సమాచారం :