యుఎస్ లో 2వ రోజు కూడా ‘ఆగడు’ హౌస్ ఫుల్

Published on Sep 20, 2014 3:00 pm IST

aagadu-reports
మహేష్ బాబు సరికొత్త యాటిట్యూడ్ మరియు రాయలసీమ యాసలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన ‘ఆగడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కూడా ఆగకుండా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ సినిమా లోకల్లోనే కాకుండా యుఎస్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని ఇదివరకే తెలియజేశాం. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ చేసింది.

మాకు అందిన తాజా యుఎస్ రిపోర్ట్ ప్రకారం రెండవ రోజు కూడా యుఎస్ లో అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ రన్ అవుతోంది. అక్కడ ఉన్నవారంతా మహేష్ బాబు కి ఉన్న రేజ్ వల్లే రెండవ రోజు కూడా ఈ రేంజ్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్నాయని చెబుతున్నారు. దీని ప్రకారం మొదటి వీకెండ్ లోనే 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

మహేష్ బాబు ఈ సినిమాలో చూపించిన కొత్తదనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ కూడా సినిమాలో చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది. తమన్నా, శృతి హాసన్ ల గ్లామర్ కూడా సినిమాకి అట్రాక్షన్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :