‘పవర్’తో మహేష్ బాబు ‘ఆగడు’ కొత్త ట్రైలర్ విడుదల.

Published on Sep 12, 2014 1:51 pm IST

Aagadu

మాస్ మహరాజ రవితేజ నటించిన ‘పవర్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా థియేటర్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేస్తున్నారు. మహేష్, తమన్నా జంటగా నటించిన ‘ఆగడు’ కొత్త ట్రైలర్ ను ‘పవర్’ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర తెలిపారు. కొత్త ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది. భెల్ పూరి సాంగ్ ప్రోమోలో మాత్రమే కనువిందు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ట్రైలర్ లో హాఫ్ శారీలో కనిపించనుంది.

సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఆగడు’తో మహేష్ బాబు రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టారు. సుమారు 2000 థియేటర్లలో ‘ఆగడు’ను విడుదల చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానుల అంచనాలను తప్పకుండా అందుకుంటామని దర్శకనిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :