లొకేషన్స్ కోసం గుజరాత్ వెళ్ళిన ‘ఆగడు’ టీం

Published on Jan 3, 2014 6:58 pm IST

Mahesh-Babu-Srinu-Vaitla
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆగడు’. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబదించిన కొంత భాగం షూటింగ్ కూడా చేసారు. ఈ సినిమా లోకేషన్స్ కోసం డైరెక్టర్ శ్రీను వైట్ల, సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ కలిసి గుజరాత్ వెళ్ళారు. అలాగే ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ జనవరి 18 నుండి ప్రారంభం కానుంది.

మహేష్ బాబు మరో సారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సెట్స్ పైన ఉన్న ‘ఆగడు’ కాకుండా మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

సంబంధిత సమాచారం :