భారీ రేటు పలుకుతున్న ‘ఆగడు’ ఫ్యాన్సీ షో టికెట్స్

Published on Sep 18, 2014 9:00 am IST

Aagadu-wallpapers
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలతో పాటు క్రేజ్ కూడా పెరిగిపోతోంది. అలాగే ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ లో కూడా ఈ సినిమానే ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టికెట్స్ కోసం భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే మొదటి రోజు టికెట్స్ ఇటు లోకల్ అటు ఓవరస్సీస్ లో అమ్ముడు పోయాయి.
అవి పక్కన పెడితే… హైదరాబాద్ లో జరుగుతున్న ఫ్యాన్స్ షో టికెట్స్ కూడా భారీ రేటు పలుకుతున్నాయి. హైదరాబాద్ లో 19వ తేదీ ఉదయం 4 గంటలకు వేయనున్న షోకి సంబందించిన బాల్కనీ టికెట్స్ 2500 పలుకుతుంటే, మిగిలిన టికెట్స్ 2000 పలుకుతున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు నగర్లో పడుతున్న ఫ్యాన్స్ షో టికెట్స్ రేటు కూడా భారీగానే పలుకుతోంది.
‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – తమన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. అందాల భామలు తమన్నా, శృతి హాసన్ ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్..

సంబంధిత సమాచారం :