నేటితో ముగియనున్న మహేష్ యూరప్ షెడ్యూల్

Published on Aug 25, 2014 1:54 pm IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలని యూరప్ లో షూట్ చేస్తున్నారు. ఈ రోజుతో ఆ రెండు పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. పూర్తవగానే ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి రానుంది.

ఇండియా తిరిగి వచ్చాక మిగిలి ఉన్న చిన్న చిన్న పాచ్ వర్క్ సీన్స్ ని ఈ చిత్ర టీం ఫినిష్ చేస్తుంది. అలాగే మహేష్ బాబు కూడా ఇండియాకి తిరిగి వచ్చాక తన పార్ట్ కి డబ్బింగ్ మొదలు పెట్టనున్నాడు. తమన్ మ్యూజిక్ అందించిన ‘ఆగడు’ ఆడియోని ఆగష్టు 30వ తేదీన శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.

‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఈ చిత్ర టీంని అడిగితే ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ‘ఆగడు’ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :