మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్ !

మీడియాకు క్షమాపణలు చెప్పిన అమీర్ ఖాన్ !

Published on Aug 7, 2022 7:40 PM IST

స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా “లాల్ సింగ్ చద్దా”. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తన సినిమా కోసం అమీర్ దేశవ్యాప్తంగా చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ రోజు ప్రమోషన్స్ కోసం చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే, ఈ ప్రెస్ మీట్ ప్రారంభానికి ఊహించని జాప్యం జరిగింది, దాంతో అమీర్ తమిళ మీడియాకు క్షమాపణలు చెప్పాడు. “లాల్ సింగ్ చద్దా” సినిమా అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని అమీర్ అన్నారు.

ఇక హీరో నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి ఈ “లాల్ సింగ్ చద్దా” సినిమాతో బాలివుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆమిర్‌ ఖాన్‌ కి కరీనా కపూర్‌ జోడిగా నటించిన ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా వస్తోంది. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు