ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ఆవిరి !

Published on Oct 10, 2019 5:51 pm IST

‘అనసూయ, నచ్చావులే, అనసూయ, అవును’ లాంటి చిత్రాలతో తన ప్రత్యేక శైలిని చాటుకున్న దర్శకుడు రవిబాబు. కానీ గత కొన్నాళ్ళుగా ఆయనకు సరైన హిట్ లేదు. ఆయన చివరి ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’ కూడా పరాజయం చెందింది. దీంతో ‘ఆవిరి’ పేరుతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు రవిబాబు. ‘మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే ? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లోని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ హారర్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయని అనిపిస్తోంది.

కాగా రవిబాబు గత చిత్రాల్లానే ఈ చిత్రం కూడా భిన్నంగా ఉంటుందట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 1న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More