‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ లాంటి వరుస లవ్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో నాగ శౌర్య నుంచి వస్తున్న మరో రొమాంటిక్ లవ్ స్టొరీ ‘అబ్బాయితో అమ్మాయి’. రమేష్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకొని డిసెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడటానికి సిద్దపడుతున్నాయి.
దాంతో ఈ చిత్ర టీం అన్ని సినిమాల మధ్యలో రిలీజ్ అవ్వడం కంటే ఒక వారం గ్యాప్ తీసుకొని న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. న్దుకే ఈ సినిమాని డిసెంబర్ 24 నుంచి జనవరి 1కి వాయిదా వేసారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగ శౌర్య సరసన బాలీవుడ్ భామ పాలక్ లల్వాని హీరోయిన్ గా నటించనుంది. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.


