ఎట్టకేలకు విడుదలకానున్న ఏబిసిడి !

Published on Apr 4, 2019 3:21 pm IST

యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) రిలీజ్ ఇప్పటికే పలు సార్లు వాయిదాపడపడంతో అసలు ఈసినిమా విడుదలవుతుందా అనే అనుమానాలు మొదలు అయ్యాయి. ఇక తాజాగా ఈసినిమా విడుదలై క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్. మే 17న ఈచిత్రం విడుదలకానుందని అలాగే ట్రైలర్ కూడా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుందని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బ్లూ స్కై సినిమాస్ ఓవర్సిస్ లో విడుదలచేయనుంది. సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :