లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చేతికి ఏబిసిడి !

ABCD

యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన ఈసినిమాలోని సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సంస్థ ఎఫ్ 2 ను అక్కడ విడుదల చేసి భారీ లాభాలను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఈ చిత్రం తోపాటు నాని జెర్సీ చిత్రాన్ని కూడా ఆక్కడ విడుదలచేస్తుంది.

సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ ఏబిసిడి లో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈచిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Exit mobile version