అల్లు శిరీష్ సినిమా మళ్ళీ వాయిదాపడనుందా ?

Published on Mar 9, 2019 9:33 am IST

యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) రిలీజ్ డేట్ మళ్ళీ మార్చనున్నారని వార్తలు వస్తున్నాయి. మొదటగా మార్చి 1 న సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కుదురకపోవడంతో విడుదలను మార్చి 21కి వాయిదా వేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా విడుదలకావట్లేదని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా సినిమాని ఏప్రిల్లో విడుదలచేయాలనీ బావిస్తున్నారట మేకర్స్. అయితే ఈవిడుదల తేదీ ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది.

సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు. బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More