హీరో విశాల్ , సమంత జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తేరై’.తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది . తెలుగులో ఈ సినిమా ఇప్పటివరకు మొదటివారంలో ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది .
సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలించింది. పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గుజ్జులపూడి హరి నిర్మించారు .


