‘అభిమన్యుడు’ ట్రైలర్ విడుదల తేది ఖరారు !

‘అభిమన్యుడు’ ట్రైలర్ విడుదల తేది ఖరారు !

Published on May 28, 2018 8:00 PM IST

హీరో ‘విశాల్, సమంత’ జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం ఫై పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన సినిమా ‘ఇరుంబు తిరై’. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా వెళుతోంది.

ఈ చిత్రాన్ని జి. హరి’ అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న తెలుగులో విడుదల చేస్తున్నారు.ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయత్రం 5 గంటలకి విడుదల చేయనున్నారు . ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషనల్ కార్యక్రమాలలో హీరో విశాల్, సమంత జోరుగా పాలుగొంటున్నారు . తెలుగులో ఈ చిత్ర విజయం ఫై ధీమా గా ఉన్నారు చిత్ర యూనిట్ . యాక్షన్ కింగ్ ‘అర్జున్’ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు .

తాజా వార్తలు