అస్వస్థతకి గురైన ‘అభినందన’ డైరెక్టర్

అస్వస్థతకి గురైన ‘అభినందన’ డైరెక్టర్

Published on Jun 10, 2014 6:46 PM IST

abinandana-director
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఈ పాట తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ పాట అభినందన సినిమా లోనిది. ఈ సినిమాకి కార్తీక్, శోభన పెర్ఫార్మన్స్ లతో పాటు ఇళయరాజా మ్యూజిక్ హైలిట్ అయితే ఇలాంటి ఓ ప్రేమ కావ్యాన్ని తెరపై ఆవిష్కరించిన క్రెడిట్ మాత్రం ఫేమస్ కెమెరామెన్, డైరెక్టర్ అశోక్ కుమార్ కె చెందింది.

కెమెరామెన్ గా మంచి పేరున్న అశోక్ కుమార్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో ఆయన్ని చెన్నైలోని ఎస్ఆర్ఎం హాస్పిటల్స్ లో చేర్చారు. ప్రస్తుతం ఆయన కండిషన్ కాస్త సీరియస్ గా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.

అశోక్ కుమార్ తెలుగు తమిళ భాషల్లో కలిపి 100కి పైగా సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

తాజా వార్తలు