అభినవ్ గోమఠం “మై డియర్ దొంగ” టీజర్ కి డేట్ ఫిక్స్!

అభినవ్ గోమఠం “మై డియర్ దొంగ” టీజర్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 2, 2024 3:03 AM IST

ఇటీవల, అభినవ్ గోమఠం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రంలో లీడ్ రోల్ లో కనిపించాడు. తన సిన్సియర్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని అప్ కమింగ్ మూవీ మై డియర్ దొంగ త్వరలో ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ మార్చి 4వ తేదీన, సోమవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో అభినవ్ గోమఠం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే, ఈ చిత్రానికి ర‌చ‌యిత కూడా షాలిని కొండేపూడి. బి. ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగకు దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి దీనిని నిర్మించారు. ఈ చిత్రం కి సంబందించిన రిలీజ్ డేట్ పై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు