అభినేత్రి 2 కూడా వాయిదాపడింది !

Published on Apr 27, 2019 1:02 pm IST

తెలుగులో మే 1 న విడుదలకానున్న సినిమాలు అవెంజర్స్ ఎండ్ గేమ్ దెబ్బకు వాయిదాపడుతున్నాయి. అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ అర్జున్ సురవరం మే 1 న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదావేశారు. ఇక తాజాగా తమన్నా ‘అభినేత్రి 2’ విడుదల కూడా వాయిదాపడింది.అభినేత్రి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా మే 1న విడుదలకానుందని ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ను తెలుగు తోపాటు తమిళంలో మే 31న విడుదలచేయనున్నారు. ఇక అదే రోజు మచ్ అవైటెడ్ మూవీ ఎన్ జి కె కూడా విడుదలకానుంది. మరి ఈ భారీ చిత్రానికి అభినేత్రి 2 ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.

ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా , ప్రభుదేవా తోపాటు నందిత శ్వేత ముఖ్య పాత్రలో నటిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ విడుదలచేయనుంది.

సంబంధిత సమాచారం :