‘కింగ్‌’ కోసమే తన కొత్త లుక్ అట !

‘కింగ్‌’ కోసమే తన కొత్త లుక్ అట !

Published on Feb 17, 2026 7:00 AM IST

king movie

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ కొన్ని నెలలుగా కొత్త హెయిర్‌ స్టైల్‌ తో కనిపిస్తూ సోషల్‌ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఐతే, ఈ లుక్‌ ‘కింగ్‌’ (king movie )సినిమా కోసమని ఓ కార్యక్రమంలో అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అభిషేక్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో అభిషేక్‌ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం.

కాగా ఈ సినిమాలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌, దీపికా పదుకొణె కూడా సందడి చేయనున్నారు. షారుక్‌- అభిషేక్‌ ఇంతకుముందు ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘కభీ అల్విదా నా కెహనా’లాంటి చిత్రాల్లో కలిసి నటించి మెప్పించారు. అభిషేక్‌ ‘రావణ్‌’లో నెగెటివ్‌ షేడ్స్‌ పాత్ర పోషించి, ఆకట్టుకున్నారు. షారుక్‌- సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పఠాన్‌’ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు కింగ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

తాజా వార్తలు