తెలుగు సినిమాల్లో నాన్న పాత్ర గురించి !

తెలుగు సినిమాల్లో నాన్న పాత్ర గురించి !

Published on Jun 20, 2021 11:31 PM IST

నేడు ఫాదర్స్ డే. ‘నాన్న..’కు మనిషి జీవితంలో ఎంతో విలువ ఉంది. మరి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాన్న పిల్లల కోసం ఎప్పుడూ ఏదో చేయాలని తపన పడుతూ ఉంటాడు. కానీ పిల్లలు మాత్రం ఎప్పుడూ నాన్నను మిస్ అవుతున్నాం అని గొడవ చేస్తారు, నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. అసలు నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. మరి ఇంత గొప్ప నాన్న గురించి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అయితే ఆ వచ్చిన సినిమాల్లో నాన్న ప్రేమను చూపించే సినిమాల గురించి చూద్దాం.

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, నాన్న కోసం కొడుకు చేసే పోరాటం ఈ కథ. ఎమోషనల్ గా సాగే గొప్ప నాన్న కథ ఇది. అలాగే డాడీ సినిమా కూడా, కూతురు పై తండ్రికి ఉండే ప్రేమ నాన్న ఊపిరిలాంటిది అని చాటి చెప్పిన సినిమా. సూర్యవంశం, తండ్రి కొడుకుల ప్రేమకు కోపాలు పగలు ఉండవు అని చాటి చెప్పిన సినిమా. కొడుకు కోసం చేసే ప్రతి చిన్న పని తన జీవితం అని నమ్మే బొమ్మరిల్లు నాన్న గురించి ఎంత అని చెప్పగలం. ఇక చనిపోయిన తండ్రి పరువు కోసం, మాట కోసం, ఓ కొడుకు వదులుకున్న జీవితం ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’. ఇలా నాన్న గురించి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు