క్రిష్‌కు గ్రేట్ డైరెక్టర్ కితాబు!

క్రిష్‌కు గ్రేట్ డైరెక్టర్ కితాబు!

Published on Apr 29, 2015 8:22 PM IST

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సరికొత్త కథాంశాల నేపథ్యంలో నడిచే సినిమాలతో కొత్త పంథాకు నిర్దేశం చేసిన దర్శకుడు క్రిష్. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా, క్రిష్ హిందీలో దర్శకత్వం వహించిన సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారీ ఎత్తున ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ప్రపంచవ్యాప్తంగా మే 1న విడుదల కానుంది. ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సినిమా ఔట్‌పుట్‌పై నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ చాలా హ్యాపీగా ఉన్నారట. అర్థవంతమైన సినిమాలను తెరకెక్కించే యువ దర్శకుడు క్రిష్ గబ్బర్ సినిమాను అన్ని విధాలా ఆకట్టుకునేలా తెరకెక్కించాడని భన్సాలీ క్రిష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. శృతి హాసన్, కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

తాజా వార్తలు