‘చూసీ చూడంగానే’.. డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయి !

Published on Jan 30, 2020 5:47 pm IST

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో రానున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. కాగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. అల్లు అరవింద్ ఓటిటి ప్లాట్ ఫామ్ తో డిజిటిల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా లెంగ్త్ గంట ఏభై మూడు నిముషాలు మాత్రమే. మొత్తానికి చిత్రబృందం సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా చాల క్రిస్పీగా స్క్రీన్ ప్లేను ప్లాన్ చేసుకుంది.

ఇక ఈ సినిమా ఓ అబ్బాయి లైఫ్ లో జరిగే ఎమోషనల్ అండ్ లవ్ ఇన్సిడెంట్స్ ను ఎలివేట్ చేస్తూ.. కాలేజీ లైఫ్ నుంచీ జాబ్, సెటిల్ వరకూ ఇలా ఒక కుర్రాడి లైఫ్ లోని ముఖ్యమైన దశలను ప్రధానాంశాలుగా ఈ సినిమా రానుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తుండగా.. సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వ సాహిత్యం అందించారు. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్ పతాకంపై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు.

‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు రాజ్ కందుకూరి. ఆయన తనయుడు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా పరిచయం ఆవుతున్నాడు.

సంబంధిత సమాచారం :