నెలాఖరున విడుదలకానున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !

నెలాఖరున విడుదలకానున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ !

Published on Apr 11, 2018 1:37 PM IST

గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి తో కలిసి ‘ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్ సినిమాను చేసిన మంచు విష్ణు మరోసారి ఆయన దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. పలుసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా విడుదల ఎట్టకేలకు ఖాయమైంది. ఈ ఏప్రిల్ నెల 27వ తేదీన ఈ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ట్రైలర్, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో కూడ పాజిటివ్ అభిప్రాయమే ఉంది. ఇందులో మంచు విష్ణుతో పాటు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుండగా ప్రగ్య జైస్వాల్ కథానాయకిగా నటించింది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టులు సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు