మెగాస్టార్ “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక కి ముహూర్తం ఫిక్స్

Published on Apr 21, 2022 9:01 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం ను ఏప్రిల్ 29, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ వేడుక ను ఏప్రిల్ 23, 2022 న సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడ, పోలీస్ గ్రౌండ్స్, హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :